“CPS అంతం – OPS సొంతం”.. మహాధర్నాకు పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో CPS రద్దు ఉద్యోగుల (CPS Employees) పెండింగ్ సమస్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. TGEJAC భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడి, DRDA, SERP, IKP ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ పోరాటాన్ని ఆపేది లేదు..

ఈ సందర్భంగా ప్రతినిధులు జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ ప్రసంగిస్తూ.. 2004 సంవత్సరం తరవాత చేరిన ఉద్యోగులందరికీ గుదిబండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (CPS)అంతమై పాత పెన్షన్ విధానం అమలయ్యేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. పెండింగ్ సమస్యలపై TGEJAC రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీన LB స్టేడియంలో ఏర్పాటుచేసిన మహాధర్నా కార్యక్రమానికి ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని కోరారు.

పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలి..

CPS అంతం – OPS పంతం’, పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలని నినాదాలు చేశారు. ఈ సమావేశానికి TGEJAC భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, జమీలుల్లా, ధర్మేందర్, పండరినాథ్,  హనుమాన్లు, కృష్ణారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, బీరేందర్ సింగ్, దండు స్వామి,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, టిఎన్జీవో ఉపాధ్యక్షులు సంజీవయ్య, అతిక్ అహ్మద్, శివకుమార్, మాణిక్యం, పద్మ, సునీత, T.విజయలక్ష్మి, గీతారెడ్డి, మంగారెడ్డి, G.విజయలక్ష్మి, శ్రీవేణి, నిరంజన్ గౌడ్, విశాల్, గంగరాజు, ప్రకాష్, సునీల్, స్వామి, రవి, ఎడ్విన్ వినయ్ రాజ్, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్ రెడ్డి, శశికాంత్ రెడ్డి, ప్రవీణ్ రాజ్, సృజన్ కుమార్, కార్తీక్, సూర్య ప్రకాష్, మారుతి, K. శ్రీనివాస్, విశాల్, సాయి కుమార్ గౌడ్, నగేష్, అనురాధ అన్ని శాఖల ఉద్యోగులు మహిళా ఉద్యోగులు CPS ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>