రామచందర్ రావుకు నితిన్ నబిన్ ఫోన్.. దాడులపై ఆరా!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలపై జరుగుతున్న పరస్పర దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) ఫోన్ చేసి ఏం జరుగుతుందని ఆరా తీశారు. నిన్నటి నుంచి జరుగుతున్న దాడులపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంపై నల్లటి రంగులు చల్లినట్లు రామచందర్ రావు వివరించారు.

మంగళవారం ఉదయం భువనగిరిలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంలోకి చొరబడి ఫర్నీచర్ పగలగొట్టారని రామచందర్ రావు నితిన్ నబిన్‌కు
తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందుకే పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లను టార్గెట్ చేస్తోందన్నారు. రాష్ట్ర నాయకత్వానికి తాము అండగా ఉంటామని.. పోరాటాలపై వెనక్కి తగ్గొద్దని సూచించారు. నాగం వర్షిత్ రెడ్డికి కూడా నితిన్ నబిన్ ఫోన్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>