కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తారులో ప్రజలకు భరోసా పింఛన్ల (Bharosa Pensions) పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీలో వణుకు మొదలైందని విమర్శించారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగొద్దని వైసీపీ అంటొందని .. ప్రజలు ఏకగ్రీవం చేసుకుంటే మీరేం చేస్తారని? వైసీపీని ప్రశ్నించారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సాహించాయని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీల్లో ఆయారం, గయారంతో ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు అని సీఎం చంద్రబాబు తెలిపారు. కేసులు వేసి బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుందని మండిపడ్డారు. ఇప్పుడు సర్ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారని తెలిపారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆరోపించారు.
Also Read : ప్రజల కోసమే మేం ఒక్కటయ్యాం: సీఎం చంద్రబాబు
Follow Us On: X(Twitter)

