కలం, వెబ్ డెస్క్ : బండ్ల గణేష్ (Bandla Ganesh).. ఒకప్పుడు చిన్నచిన్న పాత్రలు పోషించి.. కమెడియన్ గా మెప్పించాడు. ఆ తర్వాత ఊహించని విధంగా పరమేశ్వర ఆర్ట్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో.. సినిమాలను నిర్మించారు. అయితే.. గత కొంతకాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. బి.జి బ్లాక్ బస్టర్స్ (BG Blockbusters) అనే బ్యానర్ స్టార్ట్ చేయడం విశేషేషం. బి.జి అంటే.. బండ్ల గణేష్ అని అర్థం. అందుకనే తన పేరుతోనే బ్యానర్ స్టార్ట్ చేశారు.
అయితే… ఈ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తారని సమాచారం. భారీ చిత్రాలను పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించి.. చిన్న సినిమాలను కొత్త బ్యానర్ పై నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కొత్త సంవత్సరంలో.. ఈ బ్యానర్ పై నిర్మించి ఫస్ట్ మూవీని అనౌన్స్ చేస్తారని తెలిసింది. గతంలో మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) సినిమా తీయాలి అనుకున్నారు. ఈ మధ్య దీపావళికి భారీగా పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి చిరంజీవి కూడా హాజరవ్వడంతో.. చిరుతో బండ్ల సినిమా చేయడం ఖాయమని టాక్ వినిపించింది.
అలాగే బండ్ల గణేష్ కు ఇద్దరు కుమారు. ఈ ఇద్దరిలో ఒకర్ని హీరోగా, మరొకర్ని డైరెక్టర్ గా చేయాలి అనుకుంటున్నారు. వీరిద్దరితో సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ.. తెర వెనుక వర్క్ చేస్తూనే ఉన్నాడు. మరి.. కొత్త సంవత్సరంలో మెగాస్టార్ తో గణేష్ (Bandla Ganesh) సినిమా ప్రకటిస్తాడా..? లేక మరో భారీ చిత్రమేదైనా అనౌన్స్ చేస్తాడా.. లేక కొత్త బ్యానర్ లో చిన్న సినిమాని అనౌన్స్ చేస్తాడో చూడాలి.
Read Also: మోహన్ లాల్ తల్లి కన్నుమూత
Follow Us On: Sharechat


