epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్​ ఉగ్రలింకులు.. అస్సాం, త్రిపురలో 11 మంది జిహాదీల అరెస్ట్​

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​ ఛాందసవాద మూకలతో సంబంధాలున్న 11 మంది జిహాదీ ఉగ్రవాదుల (Jihadists arrested) ను అరెస్ట్​ చేశారు. ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరచాలనే లక్ష్యంతో వీళ్లంతా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గువాహటిలో నగర పోలీస్​ కమిషనర్​ పీఎస్ మహంతా వివరాలు వెల్లడించారు. నిఘా సంస్థలు ఇచ్చిన సమాచార ఆధారంగా స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్​) బృందం అస్సాం, త్రిపురలో 11 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ‘సోమవారం రాత్రి అస్సాంలోని బార్పెటా, చిరంగ్​, బక్సా, డరాంగ్​తోపాటు త్రిపురలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎస్​టీఎఫ్​ దాడులు చేసింది.

11 మంది జిహాదీ ఉగ్రవాదుల (Jihadists arrested) ను అరెస్టు చేసింది. వీరంతా ఇమామ్ మహ్మదుర్​ కఫిలా(ఐఎంకే) మ్యాడ్యుల్​ సభ్యులు. బంగ్లాదేశ్​ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్​ ఉల్​ ముజాహిదీన్​ బంగ్లాదేశ్​(జేఎంబీ) గ్రూపు ఆదేశాలతో పనిచేస్తున్నారు. వీరి వద్ద ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, ఆయుధాలు దొరికాయి. ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరచడమే లక్ష్యంగా వీళ్లు పనిచేస్తున్నారు’ అని ఆయన వెల్లడించారు. కాగా, ఉగ్రవాద కార్యాకలాపాలకు పాడుతున్న జేఎంబీని భారత్​ చాలా ఏళ్ల కిందటే నిషేధించింది.

Read Also: ‘సర్’ పెద్ద స్కామ్​.. ఒక్క ఓటు గల్లంతైనా ఈసీ ముట్టడి : మమత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>