కలం, నిర్మల్ : ప్రజావాణి (Prajavani) దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడారు.
ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

