విముక్తి జాతులపై వివక్ష తొలగిపోవాలి: గ్రేసమ్మ

కలం, ఖమ్మం బ్యూరో: విముక్తి జాతులపై వివక్ష పూర్తిగా తొలగిపోవాలని, అందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి గ్రేసమ్మ (Khammam) పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సముదాయంలో సోమవారం నిర్వహించిన “విముక్తి జాతుల దినోత్సవం” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. విముక్తి, సంచార, అర్ధ సంచార వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక భద్రత వంటి ప్రధాన రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందించాలని గ్రేసమ్మ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచడం ద్వారా వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ, వారి హక్కులను పరిరక్షించడంలో అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>