కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై నిర్మించిన మూసారంబాగ్ కొత్త వంతెనను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఏటా వర్షాకాలంలో పాత వంతెన కారణంగా మూసారంబాగ్ , అంబర్ పేట వైపు వెళ్లే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ. 52 కోట్లతో 400 మీటర్ల పొడవైన కొత్త వంతెనను ప్రభుత్వం నిర్మించింది. తాజాగా ఈ వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
కాగా, మూసీలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్పేట్, మూసారంబాగ్ మధ్య ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గనుంది. మూసీ వరదల నుంచి ప్రయాణికులకు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.

