కలం, నిజామాబాద్ బ్యూరో : అమ్మగారింటొళ్లు తనను బయటకు వెళ్లగొట్టారని టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) భావోద్యేగంగా మాట్లాడారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. అమ్మగారిళ్లు బయటకు వెళ్లగొడితే తన అత్తగారు నవీపేట బిడ్డ నవలత ఒక్కమాట అనకుండా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అత్తమామ కడుపులో పెట్టుకుని కన్నబిడ్డలాగా చూసుకున్నారన్నారు. అమ్మగారిళ్లు నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడితే బయటకు వచ్చానన్నారు. రాష్ట్రంలో చేయాల్సింది చాలా ఉంది దానికి నిజామాబాద్ ప్రజలు ఆశ్వీర్వాదం కోసం పబ్బతిపట్టి అడుగుతున్నానని కవిత చెప్పారు.

