ఉట్నూర్ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే బొజ్జు పిలుపు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఉట్నూర్ (Utnoor) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో (Congress Joining) చేరారు. జెండాగూడకు చెందిన భగవంత్ రావు పటేల్, చెరువుగూడకు చెందిన మారు పటేల్, మొర్రిపేటకు చెందిన మాణిక్ రావు జెలపాత్, దంతలపల్లి గ్రామపంచాయతీకి చెందిన సుభాష్‌‌తో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>