దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు

కలం, స్పోర్ట్స్ : దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌పై 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. వైభవ్ 81 బంతుల్లో 92 పరుగులు చేశాడు. సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో ఆగిపోయాడు.

అతని ఇన్నింగ్స్‌లో దూకుడైన బ్యాటింగ్ కనిపించింది. వైభవ్ వయసు 15 ఏళ్ల 175 రోజులు. దీంతో 1969లో 16 ఏళ్ల 23 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేసిన లక్ష్మణ్ సింగ్ రికార్డును అధిగమించాడు. 2005లో 16 ఏళ్ల 307 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేసిన పీయూష్ చావ్లా కూడా ఇప్పుడు అతని వెనుకే ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు మరో ప్రత్యేక బాధ్యత కూడా వచ్చింది. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు గాయం కావడంతో కొంతసేపు మైదానం వీడాడు. దీంతో వైభవ్ దాదాపు గంటపాటు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో డీఆర్‌ఎస్‌లోనూ వైభవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆర్యన్ జుయల్ 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్‌కి ఈస్ట్ జోన్ అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వైభవ్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలడంతో జుయల్ ఔటయ్యాడు.

అంతకుముందు టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెంట్రల్ జోన్ 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో మూడు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెంట్రల్ జోన్ తరఫున రింకూ సింగ్ 60 పరుగులు చేశాడు. ఆర్యన్ జుయల్ 46 పరుగులు చేశాడు. దీంతో సెంట్రల్ జోన్ 266 పరుగులకు పరిమితమైంది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్‌కు వైభవ్ మంచి ఆరంభం ఇచ్చాడు. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. చివరికి 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. సెంచరీ మిస్ అయినా.. వైభవ్ 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి దులీప్ ట్రోఫీలో కొత్త చరిత్ర సృష్టించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>