బండి సంజయ్‌పై చర్యలు ఉండవా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కలం, వెబ్ డెస్క్: మీర్జా బేగ్ కేసులో బీఆర్ఎస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపణలు చేయడాన్ని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఖండించారు. ఆయన అజ్ఞానానికి ఇదే పెద్ద నిదర్శనం అన్నారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో మైనర్ బాలిక కుటుంబమే బయటకొచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. రామచందర్ రావు ఒక్కసారైనా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారా.. అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ స్వయంగా బెదిరించారని మైనర్ బాలిక స్వయంగా ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సంగప్పను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు.

బీజేపీ నేతల విమర్శలు హాస్యాస్పదం..

బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఊరేగించిన పార్టీ బీజేపీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. అలాంటి పార్టీ బీఆర్ఎస్ నేతలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీర్జా బేగ్‌కు సంబంధించిన ఘటన బయటకు రాగానే.. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెంటనే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించారని వివరించారు. బాధిత బాలిక ఎవరో తెలిస్తే.. ఆమెను తీసుకుని పోలీసుల వద్దకు తీసుకెళ్లి, ఫిర్యాదు ఇప్పించాలని అసదుద్దీన్ ఒవైసీని కూడా తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : సముద్రంలో ఘోర ప్రమాదం.. బోటులో 270 మంది ప్రయాణికులు..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>