కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ వారోత్సవాల సందర్భంగా భూత్పూర్ (Bhoothpur) మున్సిపల్ కేంద్రంలోని సాహితీ హైస్కూలులో మసీదు కమిటీ రెహమత్ నౌ జవాన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ జామే మజీద్ ఫేషిమాం అహమ్మద్ షరీఫ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్ద ఆఫీస్ ఫయాజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి స్వయంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు షర్ఫుద్దీన్ ప్రధాన కార్యదర్శి ఎండీ అహ్మద్ నౌ జవాన్ కమిటీ అధ్యక్షుడు జమీర్ ప్రధాన కార్యదర్శి అప్సర్ తో పాటు మైనారిటీ నాయకులు యాసీన్ ఖాసీం, నయుం సాబీర్ ఖదీర్, అబూబకర్ మైను ఖాదర్, ముస్తఫా సాహితీ పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Also Read : ప్రశ్నించడం విద్యార్థుల రాజ్యాంగ హక్కు: ఉజ్జల్ భుయాన్
Follow Us On: X(Twitter)

