కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం ఆదివారం స్వర్ణ వాగు (Swarna Vagu) లో లభ్యమైంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లోలం చిన్నయ్య (75) ఈనెల 22వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాదాపూర్ గ్రామ సమీపంలోని స్వర్ణ వాగులో చిన్నయ్య మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

