సుమతి ఆశయాలను కొనసాగిద్దాం: CPM

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కుల వివక్షకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని పార్టీకి అంకితం చేసిన కామ్రేడ్ సుమతి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ డి. రమాదేవి (CPM Ramadevi) అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలోని జేజేఆర్ గార్డెన్ లో వి. సుమతి సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశo సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రాములు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి , సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరై మాట్లాడుతూ.. కామ్రేడ్ సుమతి విద్యార్థి దశ నుండే అభ్యుదయ భావాలతో పనిచేశారని కొనియాడారు.

కులాంతర వివాహం చేసుకొని, అనేకమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆమె స్వయంగా అనేక రచనలు చేశారని, అనేక పత్రికలకు వ్యాసాలు రాశారని, ఆమె జీవితమే అనేక మందికి ఆదర్శప్రాయం అని చెప్పారు. తన భర్త పి. మధు చేదోడువాదోడుగా ఉంటూ పోరాటాలకు అండదండగా నిలబడ్డారని అన్నారు. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్ గా పనిచేస్తూ సీపీఎం పార్టీకి అనేక రూపాల్లో సేవలు అందించారాని కొనియాడారు.

ఐద్వా నాయకురాలుగా మహిళపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ప్రతిఘటిస్తూ పోరాడిన వీర వనిత అని వారు కొనియాడారు. పాత తరం నాయకులంతా కనుమరుగవడం బాధాకరమైన విషయమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకి ఇచ్చే నిజమైన నివాళి అని ఘనంగా నివాళులర్పించారు. సంతాప సభకు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఇందులో సీపీఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, వై వెంకటేశ్వరరావు, టీ సాగర్, జంగారెడ్డి, పి మురళీకృష్ణ, వెంకట్ రాములు భూపాల్, డాక్టర్ పుచ్చలపల్లి మిత్ర, ప్రొఫెసర్ శివప్రసాద్, జంపాల శ్రీమన్నారాయణ, ప్రొఫెసర్ అరీబండి ప్రసాదరావు, ఐఐటి ప్రొఫెసర్ శివప్రసాద్, ఆర్ రాంరెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు పరమేష్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, భూపాల్, వెంకట్ రాములు, కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వి పర్వతాలు, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జబ్బర్, గద్వాల జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, సుమతి కూతురు డాక్టర్ ప్రతిభ, అల్లుడు మధుసూదన్ రెడ్డి, మనవరాలు సమీరా, మనుమడు రోహిత్, ఆదిత్య రెడ్డి, కడియాల మోహన్, చంద్రకాంత్, ఏపీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>