ముంబైలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం.. మెరిసిన తెలంగాణ వాసులు

కలం, నిర్మల్: ముంబైలోని దాదర్‌లో ది ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జింఖానాలో మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన నిర్మల్ (Nirmal), కరీంనగర్, కోరుట్ల, ఇతర తెలంగాణ ప్రజలు ఈ సభలకు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాషా ఉద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం, నిత్య కళాంజలి ఫైన్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూషన్ కళాకారులు ప్రదర్శించిన ‘తెలుగు వైభవం’ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్స్‌లర్, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ హాజరై మాట్లాడారు. తెలుగు భాషను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఏఎంఎస్ ధర్మకర్తల కార్యదర్శి గాలి మురళి, ధర్మకర్త సభ్యులు సంగం ఏకనాథ్, కస్తూరి హరిప్రసాద్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ఉపాధ్యక్షులు గాజంగి వెంకటేశ్వర్, బొమ్మకంటి కైలాశ్ , ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కోశాధికారి వేముల మనోహర్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, శేర్ల ప్రహ్లాద్, కూచన బాలకిషన్, చిలివేరి గంగాదాస్, పిచుక రత్నమాల, జిందం భాస్కర్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్ రావు, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>