మ‌న్యం జిల్లాలో ఏనుగుల బీభ‌త్సం.. పంట పొలాలు ధ్వంసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: పార్వ‌తీపురం మ‌న్యం (Parvathipuram Manyam) జిల్లాలో మ‌ళ్లీ అడ‌వి ఏనుగులు (Elephants) జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. గుమ‌డ‌, కోటిపాం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచ‌రిస్తోంది. దీంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయి. ఏనుగులు గుంపులుగా పొలాల మ‌ధ్య నుంచే వెళ్తున్నాయి. నాటు వేసి కొద్ది రోజుల అయిన నేప‌థ్యంలో రైతులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పంట బాగా పండుతుంద‌ని ఆశ ప‌డుతుంటే ఏనుగులు మొత్తం నాశ‌నం చేస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు త‌క్ష‌ణ‌మే స్పందించి ఏనుగుల బారి నుంచి పంట‌ల‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. పంట న‌ష్ట‌పోయిన వారికి త‌క్ష‌ణ‌మే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>