కలం, వెబ్‌డెస్క్: రాజధానిలో నేడు జరుగుతున్న హైదరాబాద్ రన్నర్స్ (Hyderabad Runners) మారథాన్ ఎఫెక్ట్‌తో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయ్యింది. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ మారథాన్‌లో సుమారు 32,000 మంది పాల్గొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. పలు చోట్ల వాహనాలను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు.
ఈ మారథాన్ ప్రభావంతో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి, గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐకియా, టెక్ మహీంద్రా, రాయదుర్గం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన 15వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజయవంతమైందని తెలిపారు. ఈ ఈవెంట్‌కు పోలీసులతో సహా అధికారులంతా సహకరించినట్లు వెల్లడించారు. ఇలాంటి మారథాన్లు హైదరాబాద్‌ను ఫిట్‌గా మార్చడంతో పాటు నగర బ్రాండ్ విలువను మరింత పెంచుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు.

