ఏపీలో మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ గర్జన

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం వేదికగా మెగా డీఎస్సీ (Mega DSC) ఉపాధ్యాయులు చేపట్టిన ‘చలో విశాఖ – ఆత్మగౌరవ గర్జన’ కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్న మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు, అభ్యర్థులు ఈ ఆందోళనలో  భాగస్వామ్యమవుతున్నారు. ఆత్మగౌరవ పోరాట కమిటీ పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన ప్రదర్శన ద్వారా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులు గళం విప్పుతున్నారు.

నియామకాల ప్రక్రియలో నెలకొన్న అవాంతరాలను పరిష్కరించాలని, తమ సర్వీసు నిబంధనలకు సంబంధించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ పోలీసు మోహరింపు మధ్యే ఈ ఆత్మగౌరవ గర్జన కొనసాగుతుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగివచ్చేంత వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలను తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>