కలం, సినిమా: వరల్డ్ వైడ్ సెన్సేషన్‌గా మారిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని రెండో సింగిల్ ‘ఏశ నాగుల’ (Yeshanagula) ప్రస్తుతం సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో, ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని దూసుకెళ్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ బీట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ను ఊర్రూతలూగిస్తోంది.
యువ సంగీత సంచలనం అనిరుధ్ అందించిన అదిరిపోయే ట్యూన్‌కి, అచ్చమైన జానపద మాస్ ఫ్లేవర్ తోడవ్వడంతో ఈ పాట దూసుకుపోతోంది. పల్లెటూరి వాతావరణాన్ని తలపించే దమ్మున్న జానపద బాణీలు, మోత మోగించే మాస్ బీట్స్ అద్భుతమైన సింక్ కావడంతో ఈ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగిపోతోంది. ఈ మాస్ నంబర్‌తో అనిరుధ్ మరోసారి తన మ్యాజిక్‌ని రిపీట్ చేయడమే కాకుండా, నాని సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు.

