సీఎం రేవంత్‌కు కమిషన్ రిపోర్ట్.. కీలక సిఫార్సులు!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో చెరువుల పరిరక్షణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పేర్కొంది. అందుకోసం వెంటనే చిన్న నీటిపారుదల చట్టం తీసుకురావాలని కోరింది. ఈ మేరకు పలు సిఫార్సులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి రిపోర్ట్ అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కోదండ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, భవానీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండేళ్లుగా రైతు కమిషన్ చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలతో పాటు జలవనరుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ అందించారు. ఈ సందర్భంగా కమిషన్ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసి, వారిని అభినందించారు.

చెరువులను కాపాడుకుంటేనే..

రాష్ట్రంలో చెరువులను కాపాడుకుంటేనే నీటి భద్రత, వ్యవసాయ రంగ స్థిరీకరణ జరుగుతుందని కమిషన్ అభిప్రాయపడింది. గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువులను రక్షించడం అత్యంత అవసరమని స్పష్టం చేసింది. ప్రతి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ సరిహద్దులను గుర్తించి కాపాడాలని కూడా పేర్కొంది. చిన్న, పెద్ద నీటి పారుదల వనరులను కలిపేలా కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. పంటల మార్పిడి అంశంపై మరింత ఫోకస్ చేయాలన్న కమిషన్, రైతు సహకార సంఘాలను బలోపేతం చేయాలని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>