నకిరేకల్‌ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

కలం, నకిరేకల్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెప్టెంబర్ 5న నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి రాబోతున్నారు. నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. వంద పడుకల ఆసుపత్రి ప్రారంభంతో నకిరేకల్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువకానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>