కలం, వెబ్ డెస్క్: విజయవాడ (Vijayawada)లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అయిదుగురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగర పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఘాయిత్యానికి పాల్పడిన అయిదుగురు యువకులను సీసీ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు.
ఒంటరిగా ఉండటంతో..
బాధితురాలు కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తుండటాన్ని గమనించిన యువకులు.. అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. అచేతనంగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : రేపే పరీక్ష.. నీట్ విద్యార్థిని ఆత్మహత్య
Follow Us On: X(Twitter)

