కలం, స్పోర్ట్స్ : నీరజ్ చోప్రా (Neeraj Chopra) అభిమానులకు షాకింగ్ న్యూస్. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ 2026 సీజన్‌కు ముందుగానే ముగింపు పలికారు. ట్రైనింగ్‌లో టెంకికి లిగమెంట్ గాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గాయం కారణంగా వచ్చే నెలలో జరిగే ఆసియా గేమ్స్(Asia Games)కు నీరజ్ దూరం కానున్నారు. డైమండ్ లీగ్ ఫైనల్లోనూ ఆడలేరు. లాసాన్ డైమండ్ లీగ్‌లో నీరజ్ 88.05 మీటర్లతో ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ట్రైనింగ్‌లో గాయం అయింది. డాక్టర్, సపోర్ట్ టీమ్‌తో చర్చించిన తర్వాత మిగిలిన సీజన్లో పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి పెట్టనున్నారు. 2026 సీజన్లో నీరజ్ (Neeraj Chopra)కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జూన్‌లో దోహా డైమండ్ లీగ్‌తో పోటీల్లోకి తిరిగి వచ్చారు. అక్కడ 85.69 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత గ్లాస్గోలో 85.83 మీటర్లతో రజతం గెలిచారు. లాసాన్లో 88.05 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. లాసాన్ ప్రదర్శనతో నీరజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నారనే సంకేతాలు కనిపించాయి. కానీ ఆ తర్వాతి గాయంతో సీజన్ మొత్తం ముగిసింది.
డైమండ్ లీగ్ ఫైనల్‌కు కూడా నీరజ్ అర్హత సాధించారు. క్వాలిఫికేషన్లో ఏడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఈవెంట్‌కూ దూరం కానున్నారు. నీరజ్ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. ఆసియా గేమ్స్‌లో ఆయన లేకపోవడం భారత అథ్లెటిక్స్ జట్టుకు కీలక మార్పుగా మారింది.
Also Read : గోల్ఫ్ టూరిజం హబ్‌గా హైదరాబాద్: కపిల్ దేవ్
Follow Us On: X(Twitter)

