కలం, వెబ్ డెస్క్: అంతరిక్ష పరిశోధనలు చేస్తూనే అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఇస్రో కల్పిస్తోంది. సైంటిస్టుగా ఎంటరైతే చాలు.. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడమే కాకుండా.. భవిష్యత్తులో ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా రాణించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇస్రో రిక్రూట్మెంట్ విభాగం 175 సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టులకు (ISRO Scientist Jobs) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, 28 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఉంది. సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభం నుంచే రూ.56,100 వేతనంతో పాటు అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి.
ఖాళీల వివరాలు ఇలా..
మూడు విభాగాల్లో 175 సైంటిస్ట్ పోస్టులను (ISRO Scientist Jobs) భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో 100 పోస్టులు, మెకానిక్ విభాగంలో 53 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 22 పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్‌గా నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిశాక.. పరీక్షలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామో మరో ప్రకటనలో ఇస్రో వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!
Follow Us On: X(Twitter)

