నిర్మల్‌లో మహిళల వ్యాపారాభివృద్ధికి ర్యాంప్ పథకం.. రెండేళ్లపాటు శిక్షణ

కలం, నిర్మల్: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని వి-హబ్‌ సౌజన్యంతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తల (Women Entrepreneurs) కు శనివారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలను మరింత వేగంగా అభివృద్ధి చేయడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పథకం కింద ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు (Women Entrepreneurs) రెండేళ్లపాటు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం, అవసరమైన సహకారం అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.

జౌళి, ఆహార శుద్ధి, తయారీ, చేతివృత్తులు, హస్తకళలు తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తారన్నారు. వ్యాపార నిర్వహణ నైపుణ్యాల పెంపు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, కొత్త ఉత్పత్తుల రూపకల్పన, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌లో అవసరమైన సహకారం అందిస్తారని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణ అనుసంధానం కల్పించడంతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వ్యక్తిగత మెంటరింగ్‌ అందించి వ్యాపారాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీపీఎం మారుతి, వి-హబ్‌ డైరెక్టర్‌ జాహిద్‌‌ షేక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, ప్రతినిధులు డాక్టర్‌ డెబోశ్రీ, రూపానంద్‌, హరిచందన, స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>