కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం (KING100) అఫీషియల్ గ్లింప్స్ విడుదలైంది. ‘ది కింగ్స్ గేమ్ బిగిన్స్ నౌ’ పేరుతో వచ్చిన ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ గ్లింప్స్ పరిశీలిస్తే నాగార్జున ఒక భారీ స్కామ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. వీడియోలో నాగ్ సరికొత్త వింటేజ్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాగార్జున మైల్‌స్టోన్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

