కలం, వెబ్డెస్క్: హిందూపురం (Hindupur)లో శనివారం ఉదయం పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. స్థానికంగా తిరుగుతున్న పందుల దొంగల ముఠా (Pig Theft Gang) పై పోలీసులు కాల్పులు జరిపారు. హిందూపురంలోని ఊటుకూరు ప్రాంతంలో ఓ ముఠా బొలెరో వాహనంతో హల్చల్ చేసింది. అయితే పోలీసులకు చిక్కకుండా దుండగులు పరారయ్యారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు వారి వాహనాన్ని ఛేజ్ చేశారు. అయితే వారిని మాత్రం పట్టుకోలేకపోయారు. దుండగులు కర్ణాటక వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
స్థానికంగా తరచూ పందుల దొంగతనం జరుగుతూ ఉంటుంది. దుండగులు కర్ణాటక నుంచి వాహనాల్లో వచ్చి తీసుకెళ్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చేజ్ చేయగా, వాళ్లు పోలీసులపైనే ఎదురుదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

