నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాలను సందర్శించనున్నారు.

మొదటి దశలో ఈ రోజు, రేపు మోదీ ఉజ్బెకిస్తాన్‌లో పర్యటిస్తారు. మోదీకి ఇది ఉజ్బెకిస్తాన్‌లో నాలుగో పర్యటన. అక్కడ ఆయన ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. ఈ భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి.

అనంతరం ఈ నెల 31వ తేదీతో పాటు వచ్చే నెల 1వ తేదీన కిర్గిజ్ రిపబ్లిక్‌లో మోదీ పర్యటిస్తారు. అక్కడే జరగనున్న 26వ ఎస్‌సీఓ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. దీంతోపాటు కిర్గిజ్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>