తజిమా దెబ్బ.. కోరెన్ జర్నీ ఎండ్

కలం, స్పోర్ట్స్ : భారత ఎంఎంఏ ఫైటర్ చుంగ్రెంగ్ కోరెన్‌కు భారీ షాక్ తగిలింది. రోడ్ టు యూఎఫ్‌సీ సీజన్-5 సెమీఫైనల్లో (UFC Semifinal) జపాన్ ఫైటర్ రియో తజిమా చేతిలో ఓడిపోయాడు. దీంతో యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ దిశగా సాగుతున్న కోరెన్ ప్రయాణం సెమీఫైనల్‌తోనే ముగిసింది. షాంఘైలో జరిగిన బాంటమ్‌వెయిట్ సెమీఫైనల్లో ఇద్దరూ 15 నిమిషాలు పోరాడారు. కోరెన్ తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడాడు. లెగ్ కిక్స్‌తో దాడి మొదలుపెట్టాడు. తర్వాత తజిమాను కేజ్ వైపు తీసుకెళ్లాడు. టేక్‌డౌన్ కూడా సాధించాడు. అయితే తజిమా వెంటనే పైకి లేచాడు. కొద్దిసేపు కోరెన్ వెనుక భాగాన్ని కూడా పట్టుకున్నాడు.

రెండో రౌండ్‌లో కోరెన్ మళ్లీ కేజ్ దగ్గర ఫైట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ తజిమా చిన్న పంచ్‌లతో పాయింట్లు సాధించాడు. ఒక రైట్ హ్యాండ్ కూడా బలంగా తగిలింది. మూడో రౌండ్‌లో కోరెన్ మళ్లీ టేక్‌డౌన్ సాధించాడు. ఎక్కువ సమయం తజిమాను నేలపై కంట్రోల్ చేశాడు. మొత్తంగా ఎనిమిది నిమిషాలకు పైగా కంట్రోల్ టైమ్ సాధించాడు. అయితే తజిమా దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. చిన్న పంచ్‌లు, మోకాలి దెబ్బలతో స్కోర్ చేశాడు. చివరకు ఆ దెబ్బలే జడ్జిల నిర్ణయంలో కీలకంగా మారాయి.

ముగ్గురు జడ్జిలు కూడా తజిమాకే విజయం ఇచ్చారు. స్కోర్లు 30-27, 29-28, 29-28గా నమోదయ్యాయి. దీంతో తజిమా రోడ్ టు యూఎఫ్‌సీ ఫైనల్‌కు చేరాడు. కోరెన్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కోరెన్‌కు ఇది మరో కీలక అవకాశం. మేలో షార్ట్ నోటీసుపై టోర్నీలోకి వచ్చిన అతడు క్వార్టర్‌ఫైనల్లో అజేయంగా ఉన్న జపాన్ ఫైటర్ ర్యూహో మియాగుచిని రెండో రౌండ్‌లో రియర్-నేకెడ్ చోక్‌తో ఓడించాడు. ఆ విజయంతో సెమీఫైనల్‌కు చేరిన కోరెన్‌కు ఇప్పుడు తజిమా అడ్డుకట్ట వేశాడు. దీంతో యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ కోసం అతడి ప్రయాణం ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>