తెలంగాణ ఓపెన్ గోల్ఫ్ విజేతగా రషీద్ ఖాన్

కలం, స్పోర్ట్స్: వికారాబాద్‌లోని వూటీ గోల్ఫ్ కౌంటీలో తెలంగాణ ఓపెన్ 2026 పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల రషీద్ ఖాన్ (Rashid Khan) ఈ టోర్నీ విజేతగా నిలిచారు. చివరి రౌండ్‌లో ఐదు-అండర్ 67 స్కోరు సాధించిన ఆయన, మొత్తం 23-అండర్ 265 స్కోరుతో ట్రోఫీని ముద్దాడారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు ఈ విజయం దక్కింది. రషీద్ ఖాన్ కెరీర్‌లో ఇది 15వ ప్రొఫెషనల్ టైటిల్ కాగా, పీజీటీఐ (PGTI)లో 11వ విజయం. ఈ విజయంతో ఆయనకు రూ.15 లక్షల బహుమతి లభించింది. ప్రస్తుత సీజన్ ర్యాంకింగ్స్‌లో ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు. ఆట ప్రారంభంలో రషీద్ రెండు బోగీలతో నెమ్మదిగా మొదలుపెట్టారు. కానీ వెంటనే కోలుకుని వరుసగా బర్డీలు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించారు.

చివరివరకు ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. గత ఏడేళ్లలో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఈ గెలుపు తనకు ఎంతో ప్రత్యేకమని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అటు ఢిల్లీకి చెందిన హనీ బైసోయా 20-అండర్ 268 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రూ.10 లక్షలు సొంతం చేసుకున్నారు. వీర్ అహ్లావత్, అంగద్ చీమాలు సంయుక్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ గెలుపు రషీద్ ఖాన్‌కు కొత్త ఊపునిచ్చింది. క్రీడల్లో ఓర్పు, పట్టుదల ఉంటే ఎంతటి కష్టకాలాన్నైనా అధిగమించి మళ్లీ విజేతగా నిలవవచ్చని ఈ టోర్నీ మరోసారి నిరూపించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>