కేంద్ర విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రాలకు తీరని నష్టం.. సీపీఎం ఫైర్

కలం మెదక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందని, ఈ విధానంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. సుధా భాస్కర్ ఆరోపించారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కార్యాలయంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా “2025 విద్యుత్ సవరణ చట్టం – ప్రజలపై భారం” సదస్సు జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించేందుకు వేగంగా అడుగులు వేస్తోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో వినియోగదారులపై భారం మోపే విధానాలను వెంటనే వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రైవేటీకరణతో నష్టాలు

విద్యుత్ రంగం ప్రైవేటీకరణ జరిగితే, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరకు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడి, కొత్త ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. విద్యుత్ రంగాన్ని కేంద్రం గుప్పిట్లోకి తీసుకునేందుకు యత్నిస్తోందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకుంటోందని సుధా భాస్కర్ మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>