కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. గుండెకు స్టంట్ వేయడంతో కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు సమాచారం. అంబటి రాంబాబు ఆరోగ్యంపై పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

