శిశుగృహంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

కలం, కరీంనగర్: నగరంలోని (Karimnagar) శిశుగృహం చిన్నారులతో కలిసి జిల్లా సంక్షేమ అధికారి మార్త సరస్వతి శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులకు రాఖీలు కట్టించి, వారికి స్వయంగా మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ప్రేమకు దూరంగా ఉన్న శిశుగృహ (Sishu Gruha) పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి రాకతో పిల్లలంతా ఎంతో ఆనందంగా, సందడి చేస్తూ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య ప్రొటెక్షన్ ఆఫీసర్ పూదరి శాంత, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సుందరగిరి సాయికిరణ్ గౌడ్, శిశుగృహ ఏఎన్ఎం మెట్టు రమాదేవి, కౌన్సిలర్ కీర్తి, శిశుగృహ ఆయాలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>