చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు ప్రతిజ్ఞ

కలం, నిర్మల్: రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ (Sarangapur) మండలం చించోలి (బి) గ్రామ శివారులోని గండి రామన్న అర్బన్ పార్క్‌‌లో ‘వృక్ష రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ రాఖీలను కదంబ వృక్షాలు, రాఖీ తీగలతో స్వయంగా తయారు చేసి ప్రకృతి ప్రేమికులు, పార్క్ సందర్శకులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టించారు. చెట్లను సైతం సోదరీ సోదరుల బంధానికి ప్రతీకగా భావిస్తూ వాటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెట్లను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎండీ. నజీర్ ఖాన్, వృక్షమిత్ర సంఘం సభ్యులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ మధు, రమణారెడ్డి, సిద్ధూ, స్వదేశ్ పరికిపండ్ల, అశోక్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>