ఖానాపూర్‌లో బ్యాంకర్ల కమిటీ సమావేశం

కలం, నిర్మల్: ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఉమ్మడి మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అధ్యక్షత వహించగా, రైతు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల బ్యాంక్ అనుసంధానం, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెస్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, ముద్రా, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాల అమలుపై చర్చించారు.

కేంద్ర పథకాలకు సంబంధించి సాంకేతిక మద్దతు విధానాలను బ్యాంకర్లకు, వివిధ శాఖల అధికారులకు రామ్ గోపాల్ సమగ్రంగా వివరించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సకాలంలో జమ అయ్యేలా బ్యాంక్ ఖాతాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని  ఆదేశించారు. విద్యార్థులకు రెండు వేల కొత్త బ్యాంక్ ఖాతాలను త్వరితగతిన ప్రారంభించాలని బ్యాంక్ మేనేజర్లకు సూచించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>