కలం, వలిగొండ: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండలంలో ఘనంగా జరుపుకున్నారు. నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష అంటూ సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షా బంధన్ సందర్భంగా మండల కేంద్రం సహా గ్రామాల్లో రాఖీ విక్రయ కేంద్రాల వద్ద జనాల సందడి కనిపించింది. విభిన్న రీతుల్లో ఉన్న రాఖీలను కట్టేందుకు ఆసక్తి చూపారు.

