కలం, వనపర్తి: రాఖీ పండుగ రోజున విధుల్లో ఉన్న అన్నను మరచిపోని ఓ చెల్లెలు.. ప్రత్యేకంగా బస్టాండ్‌కు చేరుకుని రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటింది. వనపర్తి (Wanaparthy) ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా సెలవు లేక విధుల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరింట గ్రామానికి చెందిన ఆయన సోదరి శ్యామల అన్నకు రాఖీ కట్టేందుకు వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు.
అన్న విధులు నిర్వహిస్తున్న బస్సు కోసం కొంతసేపు ఎదురుచూసిన ఆమె.. బస్సు బస్టాండ్‌కు రాగానే ఎక్కి డ్యూటీలో ఉన్న అన్న శ్రీనివాసులకు రాఖీ కట్టారు. అనంతరం మిఠాయి తినిపించి అన్న ఆశీర్వాదం తీసుకున్నారు. ‘రాఖీ రోజున అన్నకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది’ అని శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అన్నను చూసేందుకు చెల్లెలు ప్రత్యేకంగా బస్టాండ్‌కు రావడం, రాఖీ కట్టడం చూసిన ప్రయాణికులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

