కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథ పుస్తక ప్రచురణకు అడ్డుంకులు ఏర్పడ్డాయి. సోనియా రాసిన “బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్” పుస్తకం ప్రచురణపై పెంగ్విన్ రాండమ్ హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పుస్తకం ప్రచురణ చేయడానికి నిరాకరించింది.
బిలాంగింగ్ పుస్తకంలో కొన్ని మార్పులు చేయాలని ప్రచురణకర్త సూచించగా దానికి రచయిత అయిన సోనియాగాంధీ ఒప్పుకోలేనట్లు తెలుస్తోంది. దీంతో భారత్ లో బిలాంగింగ్ పుస్తకం ప్రచురణ బాధ్యత నుంచి పెంగ్విన్ రాండమ్ హౌస్ తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, బిలాంగింగ్ పుస్తకం ప్రచురణపై పెంగ్విన్ బాంబ్ పేల్చింది. అసలు ఈ పుస్తకానికి తాము ఇండియాలో ప్రచురణకర్తలే కాదని స్పష్టం చేసింది.

