యశ్ ‘టాక్సిక్’ మూవీపై అన్నామలై ఫైర్

కలం, వెబ్ డెస్క్: కన్నడ హీరో యశ్ నటించిన ‘టాక్సిక్’ (Toxic) మూవీపై తమిళనాడు కీలక నేత అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి సినిమాలు తీస్తూ యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘ఒక చిత్రం విడుదలైన మొదటి రోజునే రూ.104 కోట్లు వసూళ్లు చేసిందని నిన్న విన్నాను. సాధారణంగా మనం కొన్ని సార్లు విషపూరితంగా మాట్లాడుతుంటాం. కానీ ఆ సినిమా పేరే ‘టాక్సిక్’ అని పెట్టేశారు. దీనిలో మహిళలను చాలా చెడుగా చూపించారు. అయినా కలెక్షన్లు బాగా సాధిస్తోంది’ అని పేర్కొన్నారు.

ఇంకా అన్నామలై స్పందిస్తూ.. ‘ఇలాంటి చిత్రాలు యువతపై చాలా ప్రభావం చూపుతాయి. వీటినే చూడాలని యువకులను ప్రోత్సహిస్తే.. దేశం పరిస్థితి ఏంటి..? మహిళల భద్రత గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటాం. దీనికి సెన్సార్ బోర్డ్ ఎలా సర్టిఫికేట్ ఇచ్చి, విడుదలకు అనుమతించారో సమాధానం చెప్పాలి. ఈ చిత్రం మహిళలను గౌరవించేలా లేదు’ అని ధ్వజమెత్తారు.

తొలి రోజు నుంచే..

టాక్సిక్ మూవీ ఓ వైపు వసూళ్లలో దూసుకెళ్తున్నా.. చిత్రంలోని బోల్డ్ సీన్లపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మోతాదుకు మించి అసభ్యకరంగా కొన్ని సీన్లు ఉన్నాయంటూ పలువురు మహిళా ప్రేక్షకులు సైతం అభ్యంతరం చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కేజీఎఫ్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యశ్ నటించిన ఈ మూవీని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. నయనతార సహా అయిదుగురు హీరోయిన్లు నటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>