గనుల శాఖ ఏడీకి భారీగా అక్రమాస్తులు

కలం, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ దాడులు (ACB Raids) చేపట్టి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఉదయం నుంచి చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్లు ప్రకటించింది. వీటి మార్కెట్ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే.. డిప్యూటీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చూస్తున్న జయరాజు అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారంతో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లోని ఆయన నివాసాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేపట్టింది.

గుర్తించిన ఆస్తులు ఇవే..

హైదరాబాద్‌లోని బోడుప్పల్, కేపీహెచ్‌బీ కాలనీల్లో విలాసవంతమైన భవనాలున్నాయి. కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేట ప్రాంతాల్లో అయిదు ప్లాట్లు, మూడున్నర ఎకరాల భూమి, రూ.40 లక్షల విలువైన రెండు కార్లు, మూడు బ్యాంకుల్లో రూ.7 లక్షల నగదు, పోస్టాఫీస్ సేవింగ్స్ పథకంలో రూ.20.86 లక్షలు, రూ.37 లక్షల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించారు. తదుపరి తనిఖీలు కొనసాగుతాయని ప్రకటించింది.

డ్రైవర్ అకౌంట్లో రూ.24 లక్షలు..

సోదాలు చేస్తున్న సమయంలో జయరాజు వ్యక్తిగత డ్రైవర్ సత్తునూరి యాదయ్య ఫోన్‌ను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. దీనిలో డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ నుంచి జయరాజు కుమార్తెకు రూ.24.80 లక్షలు బదిలీ చేసినట్లు గుర్తించారు. వీటిపై ఆరా తీయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ ఇసుక రవాణాతో పాటు పలువురు వ్యక్తుల నుంచి జయరాజు వసూళ్లు చేసిన డబ్బులను డ్రైవర్ యాదయ్యకు బదిలీ చేయించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి తన కుమార్తె ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>