ఫిఫా బాస్ ఇన్ఫాంటినోపై యూఈఎఫ్ ఏ క్రిమినల్ కేసు!

కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం చోటుచేసుకుంది. ఫిఫా (FIFA) అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై స్విస్ న్యాయస్థానాల్లో క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు యూఈఎఫ్ ఏ (UEFA) సిద్ధమైంది. భవిష్యత్తు వరల్డ్ కప్ లాభాలను ప్రైవేట్ ఇన్వెస్టర్లకు విక్రయించే ప్రయత్నంలో ఆయన ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదానికి సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ కోసం యూఈఎఫ్ ఏ అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా కోర్టుల్లో దాఖలు చేసిన పత్రాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో న్యూయార్క్‌కు చెందిన ‘త్రైవ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్’ ఫండ్ సంస్థతో పాటు మయామిలోని ఫిఫా కార్యాలయం నుంచి కూడా కీలక ఆధారాలు సేకరించాలని యూఈఎఫ్ ఏ కోరింది.

ఫిఫాకు చెందిన వాణిజ్య విభాగంలో 20 శాతం వాటాను 4.2 బిలియన్ డాలర్లకు త్రైవ్ క్యాపిటల్‌కు విక్రయించేందుకు ఇన్ఫాంటినో ప్రణాళిక రచించారు. ఈ సంస్థ ద్వారానే వరల్డ్ కప్ లాభాలు నడవాల్సి ఉంది. అయితే ఇన్ఫాంటినో సొంత ప్రయోజనాల కోసమే ఈ విక్రయాన్ని తక్కువ ధరకు కుదుర్చుకున్నారని, ఇది తీవ్రమైన ఆర్థిక అక్రమమని యూఈఎఫ్ ఏ న్యాయవాదులు ఆరోపించారు.

గతంలోనే యూఈఎఫ్ ఏ సహా పలు ప్రపంచ ఫుట్‌బాల్ సంస్థల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఇన్ఫాంటినో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయవద్దంటూ ఆగస్టు 3నే యూఈఎఫ్ ఏ హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>