నేదునూర్ పాఠశాలలో రక్షా బంధన్

కలం, కరీంనగర్ : తిమ్మాపూర్ (Thimmapur) మండలం లోని నేదునూర్ జడ్పి పాఠశాలలో గురువారం రక్షా బంధన్ ముందస్తు వేడుకలను నిర్వహించినట్లు హెచ్‌ఎం లక్ష్మణ్ రావు తెలిపారు. విద్యార్థి-విద్యార్థునుల్లో ఒకరికొకరు రక్ష అనే భావాన్ని విస్తృత పర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిం చినట్లు తెలిపారు. మొక్కలను కూడా సంరక్షించే బాధ్యతకూడా పెరిగేలా మొక్కలకు కూడా రాఖీలను కట్టించినట్లు, రాఖీ లను సమకూర్చిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>