నకిలీ వైద్యులు.. ప్రజలకు సజ్జనార్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లో 12 మంది నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయిన నేపథ్యంలో ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో విడుద చేశారు. ఎలాంటి వైద్య విద్య అర్హత లేకుండా, డాక్టర్ల మాదిరి నటిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. రోగులకు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, బీపీ, మధుమేహం ఔషధాలను అందిస్తున్నారు. విచక్షణరహితంగా సెలైన్లు, ఇంజిక్షన్లు కూడా ఎక్కిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల రోగులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇవి చెక్ చేసుకున్నాకే..

ప్రజలు తాము వెళ్లే క్లినిక్‌లు, ఆసుపత్రులకు ముందు అన్ని రకాల అనుమతులున్నాయో చెక్ చేసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. వైద్యం చేస్తున్న వ్యక్తికి డీఎంహెచ్‌వో జారీ చేసిన రిజిస్ట్రేషన్ ఉందో.. లేదో.. తనిఖీ చేసుకోవాలన్నారు. అంతేగాకుండా, సదరు వైద్యుడికి సంబంధించిన విద్యార్హత సర్టిఫికేట్ వివరాలను బోర్డుల మీద ఏర్పాటు చేశారో కూడా చూసుకోవాలన్నారు.

అన్నింటికి మించి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్ పరిశీలించుకోవాలన్నారు. ఒకవేళ ఏదైనా సందేహం కలిగితే వెంటనే https://onlinetsmc.in వెబ్‌సైట్‌లో ”Doctor Search” అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ డాక్టర్ పేరు ఎంటర్ చేస్తే తెలిసిపోతుందన్నారు. ఇప్పటికే కల్తీ ఆహారం తయారు చేసేవారిపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, ఇక నుంచి నకిలీ డాక్టర్లపై కూడా నిఘా ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>