అన్న మృతదేహానికి రాఖీ క‌ట్టి చెల్లి వీడ్కోలు..!

క‌లం, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ (Raksha Bandhan) వేళ రంగారెడ్డి జిల్లాలో విషాదక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతి చెందిన త‌న అన్న‌కు ఓ చెల్లి రాఖీ క‌ట్టి అంత్య‌క్రియ‌ల‌కు సాగ‌నంపింది. షాద్‌న‌గ‌ర్‌ (Shadnagar) లోని నెహ్రూన‌గ‌ర్ కాల‌నీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నెహ్రూ కాల‌నీకి చెందిన జ‌మాల్పూర్ న‌వీన్ చ‌టాన్‌ప‌ల్లి రైల్వే గేట్ స‌మీపంలో మ‌ట‌న్ షాపు నిర్వ‌హిస్తున్నాడు. బుధ‌వారం త‌న షాపులో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య ఉంటే న‌వీన్ స‌రి చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో విద్యుదాఘాతానికి గురై క‌ప్ప‌కూలిపోయాడు.

స్థానికులు గ‌మ‌నించి న‌వీన్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే డాక్ట‌ర్లు న‌వీన్ అప్ప‌టికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ త‌ర్వాత న‌వీన్ మృత‌దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాఖీ పండుగ పూట‌ న‌వీన్ మృతితో ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. న‌వీన్‌ అంత్య‌క్రియ‌లు ప్రారంభించిన స‌మయంలో అత‌డి చెల్లి పూజిత న‌వీన్ మృత‌దేహానికి రాఖీ క‌ట్టింది. ఈ ఘ‌ట‌న అక్క‌డున్న వారంద‌రినీ క‌న్నీళ్లు పెట్టించింది. పండ‌గ పూట అన్నాచెళ్లెల్ల‌ను విద్యుదాఘాతం దూరం చేసింద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూజిత అన్న మృత‌దేహానికి రాఖీ క‌ట్టిన వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>