కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఈ నెల 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్–1లో ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ సమగ్రంగా విచారించనుంది.

