కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ నోయిడాలోని (Raksha Bandhan) 40 ఏళ్ల జితేంద్ర సింగ్ గంగ్వార్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అన్నయ్య పడుతున్న బాధను చూసిన ఆమె చెల్లి బీనా కుమారి తన కిడ్నీని దానం చేసి, అనురాగాన్ని చాటుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ రక్షాబంధన్ వేళ తన సోదరి ప్రాణదానం చేయడం మరువలేని బహుమతి అని ఆయన భావోద్వేగంతో తెలిపారు. కిడ్నీ మార్పిడి నిపుణుడు డాక్టర్ అనిల్ శర్మ, నెఫ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ కునాల్ రాజ్ గాంధీ, యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ కమాల్‌ల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం ఇద్దరూ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.
అనారోగ్య సమయంలో తన పిల్లలను పాటు అన్నివేళలా అండగా నిలిచిన సోదరికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని జితేంద్ర తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మాస్కులు ధరించడం, మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సోదరి బీనా చూపిన ధైర్యసాహసాలు, అంకితభావాన్ని డాక్టర్లు ప్రశంసించారు. ఈ ఘటనతో సోదరిలిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది.

