మక్తల్‌లో అమానవీయం.. కొడుకు కళ్లెదుటే తల్లిపై దారుణం

కలం, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) నియోజకవర్గంలో బుధవారం అర్ధరాత్రి అమానవీయ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద 13 ఏళ్ల కొడుకుతో కలిసి నిద్రిస్తున్న మహిళపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. కన్న కొడుకు కళ్లెదుటే తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా కొట్టి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి పైశాచిక ఆనందం పొందారు. అలాగే తల్లిపై జరుగుతున్న ఈ దారుణ ఘటనను అడ్డుకోబోయిన బాధితురాలి కొడుకుపై భౌతిక దాడికి పాల్పడి నిందితులు పరారయ్యారు. మక్తల్ పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మక్తల్ పట్టణానికి చెందిన 42 ఏళ్ల మహిళ గత కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ తన కొడుకుతో కలిసి పట్టణంలో భిక్షాటన చేస్తోంది. రాత్రి సమయాల్లో స్థానిక జూనియర్ కళాశాల మైదానం వద్ద తలదాచుకుంటున్నది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు, ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా గొట్టి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఉదయం అటుగా వాకింగ్ కి వెళ్లిన స్థానికులు అచేతన స్థితిలో పడి ఉన్న మహిళను గమనించి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో మక్తల్ ఎస్సై రాజు యాదవ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై మక్తల్ ఎస్ఐ రాజు యాదవ్ బాధితురాలి నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో, మత్తులోనే దుండగులు ఈ దారుణ ఘటనకు ఒడిగట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>