కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పీఆర్‌టీయూ-టీఎస్ (PRTU-TS) దేవరకద్ర (Devarkadra) మండల శాఖ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా జరిగాయి. దేవరకద్ర జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు జి. మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి. బుచ్చా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ వ్యవస్థాపకులు సామాల యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంత్ యాదవ్ ప్రవేశపెట్టిన ప్రధాన కార్యదర్శి నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం నిర్వహించిన మండల శాఖ ఎన్నికలకు మహబూబ్‌నగర్ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు గడ్డం అంజయ్య ఎన్నికల అధికారిగా, పీఆర్‌టీయూ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యుడు లయన్ అశ్విని చంద్రశేఖర్ పరిశీలకుడిగా వ్యవహరించారు. ఎన్నికలలో మండల అధ్యక్షుడిగా రఘువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ యాదవ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా సూర్మి రాఘవేందర్, మహిళా మండల అసోసియేట్ అధ్యక్షురాలిగా జయమ్మ, ఉపాధ్యక్షులుగా ఎ. పవన్ కుమార్, నరేందర్ శర్మ, మహిళా ఉపాధ్యక్షులుగా అరుణ, వీణారాణి ఎన్నికయ్యారు. మండల కార్యదర్శులుగా బి. శ్రీధర్, హేమంత్ కుమార్, మహిళా కార్యదర్శులుగా దివ్యభారతి, అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎన్నికల అధికారి అంజయ్య, పరిశీలకుడు లయన్ అశ్విని చంద్రశేఖర్ ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా బాధ్యులు మదన్ మోహన్ యాదవ్, సుధాకర్ రెడ్డి, బుచ్చా రెడ్డి, లయన్ అశ్విని చంద్రశేఖర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ బలరామ్, జీహెచ్‌ఎంలు రమేష్, రామలింగం, పీఆర్‌టీయూ-టీఎస్ మాజీ అధ్యక్షుడు నారాయణ గౌడ్, నాయకులు తిమ్మారెడ్డి, డి. కవిత, సురేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

