రాఖీల కొనుగోళ్లతో నిర్మల్ మార్కెట్లు కళకళ

కలం, నిర్మల్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగకు (Raksha Bandhan) నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. సోదరుడికి జీవితాంతం అండగా ఉంటాననే భరోసాకు ప్రతీకగా సోదరీమణులు రాఖీ కట్టే సంప్రదాయాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పండుగకు సమయం దగ్గరపడుతుండటంతో నిర్మల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, రాఖీ దుకాణాలు రంగురంగుల రాఖీలతో కళకళలాడుతున్నాయి. వివిధ ఆకృతులు, రంగులు, డిజైన్లలో రాఖీలు అందుబాటులో ఉండటంతో సోదరీమణులను అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు తమ సోదరులకు నచ్చే రాఖీలను ఎంపిక చేసుకునేందుకు దుకాణాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్లకు వస్తున్న సోదరీమణులు రాఖీలను పరిశీలించి తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తున్నారు.

రూ.10 నుంచి రూ.500 వరకు..

మార్కెట్లో రాఖీలు రూ.10 నుంచి ప్రారంభమై రూ.200, రూ.300, రూ.500 వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సాధారణ రాఖీలతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లు, ప్రత్యేక అలంకరణలతో కూడిన రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి. తమ స్తోమతకు అనుగుణంగా సోదరీమణులు రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. పండుగ సమీపిస్తుండటంతో రాఖీల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నిర్మల్ పట్టణంలోని రాఖీ దుకాణాలు, ప్రధాన మార్కెట్లలో పండుగ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>